అమిత దయాళువూ, అపార కృపాళువు అయిన అల్లాహ్ పేరుతో..

24 ఖుర్ఆన్ ఆయత్ ల మీద హిందూ యునైటడ్ ఫ్రంట్ చేసిన ఆక్షేపణలకు సంక్షిప్త సమాధానం

ప్రియమైన భగవాన్ గోయల్ గార్కి….

24 ఖుర్ఆన్ ఆయత్లకు సంబంధించి మీరు వ్రాసిన ఉత్తరం అందింది. ఈ ఆయత్లలో ముస్లిమేతరులను చంపాలనీ, నరకాలనీ, దోచుకోవాలనీ, జిహాద్ చేయాలనీ, సజీవంగా కాల్చేయాలనీ లేదంటే బలవంతంగా మత మార్పిడి చేయాలని వుందనీ, ఖుర్ఆన్ నుండి వాటిని తొలగించాలనే సారాంశంతో ఆ ఉత్తరం ఉంది.

ప్రియమైన గోయల్ గారూ! పై విధంగా చెప్పిన వారెవరో గానీ, అతనికి ఖుర్ఆన్ పట్ల అవగాహన లేదనీ, అతను ఖుర్ఆన్ ను ఎంత మాత్రం ఎరుగడనీ, ఖుర్ఆన్ భాష్యాన్ని, భావాన్ని లేశమంత కూడా తెలుసుకోలేదనీ, అరబీ భాషా వ్యాకరణా పరిజ్ఞానం బొత్తిగా తెలియని వాడని మాత్రం నేను బలంగా చెప్పగలను. అందుకే అతను దాని భావార్థాలు తప్పుల తడకగా రాస్తున్నాడు. అందుకే ఖుర్ఆన్ లో ‘కాఫిర్, ముష్రిక్’ లతో యుద్ధం, సంహారం లాంటి ప్రస్తావనలు వచ్చిన ప్రతి సారీ మీరు సందర్భోచితాలను గమనించక ముస్లిమేతరులందరి గురించి అలా చెప్పబడిందని పొరబడ్డారు. మీరు చేసిన అత్యంత మౌలిక తప్పిదం, తెలియనితనం ఇదే! ఇంకా చెప్పాలంటే మీ ఆక్షేపణలన్నీ ఈ ‘మౌలిక తప్పిదం’ పునాదుల పైనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఆయత్లకంటే మూడు నాలుగు ముందరి ఆయత్ లను కూడా పరిశీలించివుంటే – ఇక్కడ చెప్పబడిన సంహారం, దండన ల ఆదేశాలు ఒక ప్రత్యేక పాపం తో ముడి పడి వున్నాయనీ, సామన్య జనానికి ఇది అన్వయించదనీ, మీకు అర్థం అయ్యేది. మొత్తం ప్రస్తావితాంశాన్ని విడిచిపెట్టి కేవలం ఒకటి రెండు పదబంధాలను ఎత్తిచూపి ఆక్షేపించడం అంటే అది ఖుర్ఆన్ భావం, భాష్యం, వ్యాకరణం తెలియదనుకోవాలా? లేక అన్నీ తెలిసి కూడా, ప్రజలను ఖుర్ఆన్ పట్ల, ఇస్లాం పట్ల అపోహాలకు గురి చేసేటందుకు కుయుక్తులా? అన్నది నాకు అర్థం కావడం లేదు. అందుకే మాటిమాటికి నేను మీ ఈ తప్పులను ఎత్తి చూపుతూ వున్నా. దాంతో మీరు నిజాన్ని తెలుసుకునేంటందుకు ఇష్టపడతారనుకుంటున్నాను.

  • ఫిర్ జబ్ మాహ్ ముబారక్ (రమజానుల్ ముబారక్) గుజర్ జాయే తో మూర్తియోఁ కి పూజా కర్నే వాలోఁ కు జహాఁ కహీఁ మిలే, ఖత్ల్ కరో, ఔర్ పకడో ఔర్ ఉన్హే ఘేరో ఔర్ హర్ ఘాత్ కి జగహ్ ఉన్ కి తాక్ మే బైఠో (సూరా 9 – ఆయత్ 5)

మీరు చేసిన ఈ అనువాదం శుద్ధ తప్పు. అరబీ వ్యాకరణానికి, ఖుర్ఆన్ ఆదేశాలకు ఇది పూర్తి విరుద్ధం. ఈ అనువాదం చేసిన వారికి అరబీ భాష అంటే ఏమిటో తెలియనట్లుగా వుంది. అందుకే మీరు ఖుర్ఆన్ ఆయత్ లను ఆక్షేపిస్తున్నారు. ఒక వేళ మీరు ఖుర్ఆన్ ఆయత్ ల మూల భావార్థాన్ని ఎరిగి వుంటే మీరు ఆక్షేపించేవారే కాదు.

మరొక విషయం ఏమంటే, ఇక్కడ మూర్తి పూజకులందరినీ ఉద్దేశించి ఎంతమాత్రమూ చెప్పలేదు. అంతకు ముందు 3వ, 4వ ఆయతుల్లో ఎవరి ప్రసక్తైతే వచ్చిందో వారే ఇక్కడ సంబోధితులు. మరి వారెవరంటే.. హిజ్రీ 6వ యేట హుదైబియా అనే చోట దైవ సందేశహరుడు హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనతో బాటు పదునాలుగు వందల మంది ముస్లింలు తలఒగ్గి, పది సంవత్సరాల కాలానికి సంధీ ఒప్పందం చేసుకున్న వారు. ఆ సంధీ ఒడంబడికలో కొన్ని అంశాలు:-

  1. ఈ యేడు మేము ముస్లింలను ఆరాధనా (ఉమ్రహ్) నిమిత్తం మక్కాకు రానివ్వము. ఇప్పుడు వెనక్కు మరలిపోవాలి. వచ్చే యేడు కేవలం మూడు రోజుల కొరకు మాత్రమే దర్శించేటందుకు అనుమతిస్తాము.
  2. ఎవ్వరు కూడా, ఎలాంటి ఆయుధం తీసుకురాకూడదు.
  3. 3. మా వ్యక్తి మీ చెంతకు వస్తే అతన్ని వాపసు పంపించాలి. అయితే ముస్లింలకు చెందిన వ్యక్తి పారిపోయి మా వద్దకు వస్తే అతన్ని వాపసు పంపము.
  4. చుట్టు పక్కల వుంటున్న తెగలు వారి ఇష్టం మేరకు మీ పక్షాన చేరవచ్చు. లేదా మా వైపు కూడా వుండవచ్చు వారు పరస్పరం పోట్లాడుకుంటే మనం అందులో ఎవ్వరికీ కూడా మద్దతు తెలుపరాదు.

అయితే మక్కా వారు ఈ ఒడంబడికకు వ్యతిరేకంగా వ్యవహరించి కేవలం రెండేళ్ళలోనే సంధిషరతులను ఉల్లంఘించారు. వారి ఈ సంధీ ఉల్లంఘనే ఆ తర్వాత మక్కా విజయానికి కారణమయ్యింది. ఆ సమయంలో అరబ్బు విగ్రహారాధకులు నాలుగు రకాలుగా ఉన్నారు.

  1. సంధి ఒడంబడికతో ఎలాంటి సంబంధం లేని వారు.
  2. ఒప్పందాన్ని అంగీకరించారు. కానీ దాని కాలపరిమితిని నిర్ధారించలేదు.
  3. ఒక నిర్ధారిత కాలానికి ఒప్పందం కుదిరింది. దానికి కట్టుబడి వున్నవారు కొందరు.
  4. నిర్ధారిత కాలానికి ఒప్పందం కుదిరింది కానీ దానికి కట్టుబడి వుండక రెండేళ్ళకే ఆ సంధిని ఉల్లంఘించినవారు కొందరు.

ఇప్పుడిక మీరు అర్థం చేసుకోవాలి మరి! ఒకటవ, రెండవ రకం విగ్రహారాధకులను ఈ సూరా తొలిమలి ఆయత్ లలో సంబోధిస్తూ, వారికి నాల్లు నెలలు గడువు ఇవ్వబడుతోంది. ఈ గడువు కాలంలో వారంతా తమ భవిష్యత్తు గురించి బాగా ఆలోచించుకోవాలి. ఇక మూడవ ఆయత్ లో మూడవ రకం వ్యక్తుల ప్రస్తావన చేయబడింది. వీరందరూ సంధి ఒప్పందానికి కట్టుబడి వున్నారు. కాబట్టి, ముస్లింలు కూడా వారి పట్ల సంధి ఒప్పందానికి కట్టుబడి నడుచుకోవాలని ఆదేశించబడింది. ఇక మీరు ఆక్షేపించడానికి పట్టుకొచ్చిన 5వ ఆయత్ లోని ‘వారు’. హిజ్రీ 6వ యేట వీరితోనే సంధీ ఒడంబడిక చేసుకునేటందుకూ ముస్లింలు ఒకింత తగ్గి ముందుకొచ్చారు. అయితే ఈ ఆయత్ లో ప్రస్తావించబడిన ‘వారు’ తాము ఏర్పరిచిన ఒప్పందాన్ని తామే ఉల్లంఘించారు. ఇక ఇలాంటప్పుడు వారు ఎలాంటి మినహాయింపులకు యోగ్యులుగానీ, అర్హులు గానీ కాలేరు కదా! అందుకే వారికి కొన్ని పవిత్ర మాసాల గడువు ఇస్తూ, తమ భవిష్యత్ ప్రణాళిక ఏంటో చూసుకోమనబడింది. ఆ తర్వాత వారి ఉల్లంఘనా చేష్టకు తగిన శాస్తి చేయబడుతుంది. వాస్తవార్థం ఇలా వుంటే, మీరు మాత్రం విగ్రహారాధకులందరికీ అన్వయించుకోవడం నూటికి నూరు పాళ్ళు తప్పుగాక మరేమీ కాదు. మీతో ఇంకొక ఇబ్బంది ఏమిటంటే, ఆనాటి అరబ్బుల స్థితి గతుల గురించి మీకేమాత్రం అవగాహన వుండదు. అంతేగాక ఖుర్ఆన్ మూలార్థాల గురించి, భాష్యాల గురించి లేశమంత ఎరుక కూడా వుండదు. అందుకే మీకు ఇలాంటి అపోహాల ఎదురుదెబ్బ తగులుతూ వుంటుంది.

  • అయ్ ఈమాన్ వాలో ! మూర్తీ కి పూజా కర్నే వాలే నాపాక్ హైఁ, తో ఇస్ సాల్ కే బాద్ వో లోగ్ మస్జిద్ హరామ్ కే ఖరీబ్ భీ నా ఆయేఁ. (9-28)

మీరు సగం ఆయత్ మాత్రమే అనువాదం చేశారు. అయితే విషయం విశదమయ్యేటందుకు మీకోసం మిగతా సగం కూడా అనువదించాను. కొంచెం ఆలోచించండి, విగ్రహారాధకుల ‘మాలిన్యాన్ని’ ఈ ఆయత్ లో ‘మస్జిద్ హరమ్’ తో ఎందుకు జోడించబడి చెప్పబడింది? ఒక వేళ వారు పేడ, మలం మాదిరి మలినులైతే, అన్ని చోట్లా, అన్నీ సందర్భాల్లో కూడా వారి ఆ అపరిశుద్ధత కారణంగా వారిని దూరంగా వుంచాలని ఆదేశించబడేది. అయితే ఈ ఆయత్ వారిని కేవలం ‘మస్జిద్ హరమ్’ నుండి ఎడంగా వుంచాలని ఆదేశించింది. అంటే దానికి కారణం అల్లాహ్ మందిరంగా పిలవబడే ‘కాబా’ చుట్టూ నఖ శిఖ పర్యంతం దిగంబరులై వారు ప్రదక్షిణ చేయడమే. అలా నగ్నంగా తిరుగాడటమే ధార్మికారాధనగా వారు నమ్మడమే! ఇంకా విచిత్రమేమంటే మహిళలు సైతం పై నుండి క్రింది వరకూ వివస్త్రలై తిరుగాడేవారని ఆనాటి కొన్ని లేఖనాల వల్ల తెలుస్తున్నది. అలాంటి దిగంబర చేష్టలను ధార్మికత అనుకోవడాన్ని ఇస్లాం వ్యతిరేకిస్తుంది. పుట్టు దిగంబరులై ప్రజల ముందుకు వచ్చి దైవారాధన చేయడాన్ని మీరుకూడా ఇష్టపడరనే నేను భావిస్తున్నాను. ఇలాంటి సిగ్గుమాలిన చేష్టలు చేసేవారిని ఖుర్ఆన్ మలినులని పేర్కొంది.

షిర్క్ చేయాలనే భావనే వారిని ఇందుకు పురికొల్పుతోంది. కాబట్టి వారి ఈ చేష్ట కూడా అపరిశుద్ధమైంది. స్వయంగా వారు సైతం మలినులుగా ఎంచబడ్డారు. ఏ భావనా – విశ్వాసం వారిని ఈ అపరిశుద్ధ పనుల వైపు తీసుకుపోతూ వున్నదో అది కూడా మలినంగానే ఎంచబడుతుంది.

  1. బేషక్ ‘కాఫిర్’ తుమ్హారే ఖులే దుష్మన్ హైఁ. (4-101)

ఆయత్ మొత్తాన్ని వదిలేసి మీరు చివరి పదబంధానికి అనువాదం చేసుకున్నారు. మీ ‘ఉద్దేశ్యాని’కి అవసరమైనంతమేర తీసుకున్నారు. విశదమయ్యే భావాన్ని మాత్రం వదిలేశారు. కాబట్టి పూర్తి ఆయత్ అనువదించి భావార్థాన్ని వివరిస్తా.

మీరు దేశంలో ప్రయాణిస్తూ వున్న సమయంలో, తిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారనే భయం వుంటే ‘నమాజు’ను కుదించుకోవడంలో తప్పు లేదు. నిశ్చయంగా తిరస్కారులు మీకు బహిరంగ శత్రువులే.

ఈ ఆయతుల అవతరణకు ఒక నేపథ్యం వుంది. దైవ సందేశహరుడు ముహమ్మద్ (స) తన అనుయాయుల తోటి ప్రయాణిస్తున్నారు. చల్లగా వున్న సమయంలో ప్రయాణిస్తూ, పొద్దెక్కి ఎండ తీవ్రత ఎక్కువ కాగానే ఒక చోట బస చేస్తూ ముందకు సాగుతున్నారు. ఈ విధంగా ప్రయాణిస్తూ ఉస్ఫాన్ అనే చోట విడిది చేశారు. ఆ ప్రక్కనే ‘జుజ్నాన్’ అనే ప్రదేశంలో కాఫిర్లందరూ గుమికూడి, వీరంతా నమాజు చేస్తూ ‘సజ్దా’లోకి పోగానే ఒక్క పెట్టున దాడి చేసి ముస్లింలందరినీ దోచుకోవాలనుకున్నారు. వారి కుతంత్రాన్ని రసూలుల్లాహ్కు అల్లాహ్ తెలియజేస్తూ ఈ ఆయత్ అవతరింపజేశాడు. ‘వారికి దురుద్దేశం వుంది కాబట్టి వారి దాడి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునేటందుకు నమాజు సంక్షిప్తంగా చదువుకోండి.’ అని ఆదేశించాడు.

ఒక్కసారి ఆలోచించండి – ముస్లింలు వారితో పోట్లాడటానికి పోలేదు. ప్రయాణం మధ్యలో వేడి కారణంగా అక్కడ బస చేశారు. అలాంటపుడు బాటసారులైనందు వల్ల వారికి సహాయపడాల్సింది పోయి, దోచుకోవాలనుకోవడం మానవత్వం అనిపించుకుంటుందా? అలాంటి వారిని ‘బద్ధ శ్రత్రువుల’ని ఖుర్ఆన్ పేర్కొంటే అది తప్పవుతుందా? ఇలాగే మీతో కూడా వ్యవహరిస్తే అలాంటి వారిని మీరు మీకు మిత్రులుగా భావిస్తారా?

ఒక్క విషయం నేను గట్టిగా చెబుతున్నాను. మీకు ‘అరబీ’ రాదు. ఎన్నడూ ఖుర్ఆన్ అధ్యయనం చేసి ఎరుగరు. ఖుర్ఆన్ వ్యాఖ్యానాల పఠనం చేయరు. వ్యాఖ్యానం, భాష్యం చదవక, అవగాహన చేసుకోక కేవలం ‘అనువాదం’ చూసేసి ఖుర్ఆన్ ను అర్థం చేసుకోవాలనుకోవడం అయ్యేపని కాదు. ఒకవేళ ‘వ్యాఖ్యానం’ చదివి, దాన్ని అవగాహన చేసుకొని వుంటే – ‘కుఫ్ర్’ చేసే వారందరినీ ఇలా ఖుర్ఆన్ సంబోధించడం లేదు, కేవలం ఎవరి వ్యవహరణా తీరు, వైరీభావం ప్రస్తావించబడిందో, అలాంటి వారినుద్దేశించే ఇక్కడ ఖుర్ఆన్ చెప్పింది అని మీకు అర్థం అయ్యేది. అయితే ఆ పదాల అనువాదం మీరు ఇచ్ఛాపూర్వకంగానే వదిలేసారు కాబోలు!

  1. అయ్ ఈమాన్ వాలో! ఉన్ కాఫిరోఁ సే జో తుమ్హారే ఆస్ పాస్ హైఁ, లడో. ఔర్ చాహియే కె వో తుమ్ మే సఖ్తీ పాయేఁ (9-123)

అరేబియా ద్వీపకల్పంలో మూర్తిపూజకులే శక్తిమంతులుగా, వుండేవారు. అందులోనూ మక్కా ఖురైషీలు శక్తియుక్తుల్లో తమకు తాము సాటి అనిపించుకున్నారు. దైవేచ్ఛ ఏమోగాని తన అంతిమ సందేశహరుణ్ణి అక్కడే, ఆ తెగలోనే పుట్టించాడు.

40 ఏళ్ళ వయసు వరకు ఆయన్ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎంచుకోలేదు. ముహమ్మద్ (స) గారి ఉత్తమ గుణగణాలు, సచ్ఛీలత – సద్ప్రవర్తన, వంశ ఔన్నత్యం కారణంగా ప్రతి వ్యక్తీ ఆయన్ను గౌరవిస్తూ ఉండేవారు. అయితే అల్లాహ్ చే ప్రవక్తృత్వం పొంది, ‘తౌహీద్’ – అంటే ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించ మొదలుపెట్టగానే మొదటిసారిగా ఖురైషులే విరోధులయ్యారు. వారిని చూసిన మిగతా తెగలన్నీకూడా సహజంగానే ఇస్లాంకు శత్రువులు అయ్యారు. ఇస్లాంను కూకటి వేళ్ళతో పెకిలించాలని ఖురైషులు కోరారు. ఇట్లే ఈ మిగతా తెగలన్నీ ఇస్లాంను, ఇస్లామీయ ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలనుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యాన్ని గమనంలో వుంచుకొని ఈ ఆయత్ ను అర్థం చేసుకుంటే ఎలాంటి అపోహకు తావుండదు. ఎందుకంటే ఎదురుగావున్న శత్రువును వదిలి ఎక్కడో దూరాన వన్న వానితో పోరాడటం తెలివిగల వారు చేసే పనికాదు కదా! అయితే ముస్లింల పట్ల ద్వేషం-వైరం పెట్టుకోకుండా, మానవత్వపు విలువలతో ముస్లింల పట్ల వ్యవహరించే వారిని ఉద్దేశించి మాత్రం ఈ ఆయత్లో ఆదేశించలేదు. వివరాలకు సూరహ్ 6:8,9 ఆయత్లు చదవండి.

  1. జిన్ లోగోఁ నే హమారీ ఆయతోఁ కా ఇన్కార్ కియా (ఇస్లాం ఒ ఖుర్ఆన్ కో మాన్ నే సే ఇన్కార్ కియా) ఉన్హే హమ్ జల్ద్ హీ ఆగ్ మే ఝోక్ దేంగె. జబ్ ఉన్ కి చమ్డీ పక్ జాయేగీ తో హమ్ ఉన్హేఁ దూస్రీ ఖాలోఁ సే బదల్ దేంగే. తాకే వొ సజా కా మజహ్ చఖ్ లే. బేషక్ అల్లాహ్ ఖాదిరె ముత్లఖ్ హై. (4-56)

ఇది అల్లాహ్ కు సంబంధించినది. ఆయన దురాత్ములను మరణానంతరం శిక్షిస్తాడు. ఇస్లామీయ దృక్కోణ రీత్యా కూడా ఒక వేళ ముస్లిం అయినప్పటికీ ఒక వ్యక్తి ఏకేశ్వరునికి భయపడక, ఆఖిరత్ లో తన కర్మల లెక్కల గురించి ఏ మాత్రం లక్ష్యపెట్టక పాపాలు చేస్తే, సాటి వారిని అన్యాయంగా బాధిస్తే, వేధిస్తే అలాంటి వాడు సైతం నరకాగ్నిలో కాలాల్సిందే! పాపాలు చేసే ముస్లింలు కూడా నరకంలో వేయబడడం, తమ దుష్కర్మలకు శిక్షగా అగ్నిదండన అనుభవించాల్సిందేనని ఖుర్ఆన్, హదీస్ ల ద్వార నిర్ధారించబడింది. ఆ నరక దండన కేవలం ముస్లిమేతరులకు మాత్రమే కాదు సుమా!

ఇక మీరు ‘ఆయత్’ నైతే ప్రస్తావిస్తూ వున్నారు గానీ, ఎవరిని ఉద్దేశించి ఈ ఆయత్ అవతరించిందో వారిని మాత్రం ప్రస్తావించరు. ఈ ఆయత్ కంటే ఆరు ఆయత్ ల ముందు 51వ ఆయత్ లో ఒక ఘటన గురించి చెప్పబడింది. మదీనాలోని యూదులతో ముహమ్మద్ (స) గారు – మేము మీమీద దాడి చేయము, మీరు కూడా మా మీద దాడి చేయరాదు. మనలో ఏ ఒక్కరి మీద అయినా ఇతరులు దాడి చేస్తే మనం ఇరువురం కలిసి ఆ శత్రువుతో పోరాడాలి. అని ఒప్పందం చేసుకున్నారు. ఆయితే కొద్దిరోజుల తర్వాత ముస్లింలకూ – ఖురైషీలకు జరిగిన రెండవ యుద్ధానంతరం ఇద్దరు యూదు సర్దారులు మక్కా వెళ్ళి ఒప్పందానికి వ్యతిరేకంగా మక్కా ఖురైషులతో మంతనాలాడి మదీనా ముస్లింలపై దాడి చేయాలనీ, అందుకు తాము సహకరిస్తామని చెప్పారు. అంతేగాక మక్కా విగ్రహారాధకులతో – ముస్లింల ధర్మంకంటే మీ మతమే ఉత్తమమైందని కూడా పలికారు.

ఈ ఆయత్లో చెప్పబడిన ‘దండన’ వారు చేసిన ఈ నమ్మక ద్రోహానికి శిక్షగా ప్రస్తావించబడింది. ఈ ఆయత్ కు ముందున్న వాటిని అధ్యయనం చేయక పోతే ఈ ఆయత్ యొక్క అసలు ఉద్దేశ్యం మీకు అర్థం గాదు.

  1. అయ్ ఈమాన్ వాలోఁ ! అప్నే బాప్ ఔర్ భాయియోఁ కొ అప్నా దోస్త్ మత్ బనావో, అగర్ వో ఈమాన్ కె ముఖాబిలే మే కుఫ్ర్ కో పసంద్ కరేఁ, ఔర్ తుమ్ మే సే జో కోయీ ఉన్ సే దోస్తీ కా నాతా జోడేగా తో ఐసే హీ లోగ్ జాలిమ్ హోంగె! (9-23)

భావమేమంటే – వారు నీ తల్లిదండ్రులైనప్పటికీ, వారి దయా దాక్షిణ్యాల భారం నీ మీద అమింతంగా వున్నప్పటికీ, నీ పోషకుడైన ఏకేశ్వరుని దయానుగ్రహభారం నీ మీద ఇంకా ఎక్కువగా వుంది. కాబట్టి ఆ పోషకుని ‘హక్కు‘ కంటే నీ తల్లిదండ్రుల హక్కు చిన్నదే అవుతుంది. అందుకే ఈ ఆయత్ లో ఆదేశిస్తూ, అల్లాహ్ సామీప్యాన్నుండి దూరం చేసి నరకం వైపు కొనిపోయే ‘బాంధ్యవం’, అమ్మానాన్నలతో అన్నదమ్ములతో పెంచుకోవద్దు. అని చెప్పబడింది. ఇంత తీవ్రంగా హెచ్చరించినప్పటికీ మరోవైపు – ఈ లౌకిక జీవనంలో వారి పట్ల ఉత్తమంగా మెలగడం, వారి బాగోగులు చూడడం, వారి సేవ చేయడం, వారి అవసరాలు తీర్చడం నీపై ‘ఫరజ్’ – అంటే కర్తవ్యం అవుతుందని చెప్పబడింది. 31వ సూరా, 15వ ఆయత్ లో ఇలా చెప్పబడింది. – ‘కుఫ్ర్’ చేబూనడానికి వారిని అనుసరించకండి. అయితే వారితో ఉత్తమరీతిలో మెలగండి. అందులో లోటు చేయడమంటే ఖియామతు నాడు అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకునేటందుకు కారణమవుతుంది.

  1. కెహ్ అల్లాహ్ కాఫిర్ లోగోఁ కు రాస్తా నహీఁ దిఖాతా. (9-37)

ఇక్కడ కూడా మీరు పూర్తి ఆయత్ ను వదిలి కేవలం చివరి పదాల అనువాదం పట్టుకొన్నారు. పూర్తి ఆయత్ పఠిస్తే విషయం అర్థం అవుతుంది. అన్యాయాలు, అఘాయిత్యాలు చేసేటందుకు వీలుగా అల్లాహ్ ఆదేశాల పట్ల ఆషామాషిగా వ్యవహరిస్తూ తమ ఇష్టానుసారం నిషిద్ధాలను – ధర్మబద్ధమైనవిగా, ధర్మబద్ధమైనవాటిని నిషిద్ధాలుగా మార్చుకొనే వారి గురించి ఇందులో చెప్పబడిందని తెలుస్తుంది. ఈ ఆదేశం అలాంటి వారినుద్దేశించి ఇవ్వబడిందని అవగతమవుతుంది. ఇది గాక మీరు ఆక్షేపించినట్లే అయితే మరి, ‘సహాబా’లు ముస్లింలందరికీ ఈ లోకాంతం వరకూ ఆదర్శనీయులైనవారు. వారంతా ఇస్లాం కోసం సర్వం సమర్పించారు. మరి వారూ వారి తాత ముత్తాతలు అందరూ కాఫిర్ లే కదా! వారికి అల్లాహ్ ‘సన్మార్గ దర్శనం’ చేయకపోయుంటే వారు మహనీయులుగా లోకంలో ఎలా పరిగణించబడేవారు?

  1. అయ్ ఈమాన్ లానే వాలోఁ! తుమ్ సే పహ్లే జిన్ కొ కితాబ్ దీ గయీ థీ, జిన్హోఁ నే తుమ్హారే మజ్హబ్ కొ హసీ, ఖేల్ బనాలియా హై. ఉన్హేఁ ఔర్ ఇన్కార్ కర్నే వాలోఁకు, అప్నా దోస్త్ నా బనావో. అల్లాహ్ కా డర్ రఖో, అగర్ తుమ్ ఈమాన్ వాలే హో. (5-57)

హజ్రత్ ముహమ్మద్ (స) గారు, ఆయన వెంట అనుయాయులూ నమాజు చేస్తూ వుండిరి, సజ్దా స్థితి లోకి వెళ్ళగానే ఈ ఇరువురూ అంటే ‘అహ్లే కితాబ్’, ‘కాఫిర్’ లు ఎగతాళి చేయసాగారు. ఆ సమయంలో ఈ ఆయత్ అవతరించింది. ఇలాంటి వారితో మైత్రి సంబంధాలు నెరపడాన్ని వారించింది.

అయితే సాధారణ పరిస్థితుల్లో కేవలం మిత్రుత్వం కొనసాగించడాన్ని అంటే ముస్లిమేతరులతో కలిసి వుండటాన్ని, పెళ్ళి వేడుకల్లో పాల్గొనడాన్ని, వారితో బాటు అన్న-పానీయాలు ఆరగించడాన్ని ఇస్లాం ఎన్నడూ వద్దనదు. మూడవ సూరహ్, 118వ ఆయత్ లో ఏ ‘మైత్రి’ వద్దని చెప్పబడిందో అది ముస్లింలంటే వైషమ్యం నింపుకొని, ముస్లింల సామాజిక – సాంఘీక, సైనిక రహస్యాలు కొల్లగొట్టే వారితో స్నేహం నెరపరాదని దాని ఉద్దేశం. ఆ విషయమే ఇక్కడ చెప్పబడింది. సామాజిక, అంతర్గత విషయాల భద్రతకు ముప్పుకల్గించే సాన్నిహిత్యం తగదని ఈ ఆయత్ లో చెప్పబడింది. ఈ నేపథ్యంలో సూరహ్ 60, ఆయత్ 8,9 లలో ఒక మౌలిక సూత్రాన్ని ఖుర్ఆన్ ఏర్పరచింది. మీరు అలసత్వం చూపక దాన్ని చదవండి. మీ అనుమానాలు – సందేహాలు దూరమైపోతాయి.

ఇక్కడ ఇంకొక విషయమేమంటే మీరు దాని తర్వాతి ఆయత్ ను కూడా చదవాలి. అందులో అల్లాహ్ ఇలా అంటున్నాడు. ‘‘ముస్లింలు అజాన్ పలికి ప్రజలను అల్లాహ్ ఆరాధన – నమాజు కొరకు పిలిస్తే వీరంతా ఎగతాళీ, వేళాకోళం చేస్తారు’’. ఈ ఆయత్ కు సంబంధించి వ్యాఖ్యానకారులు ఒక సంఘటన వ్రాశారు. – మదీనాలో ఒక క్రైస్తవుడు వుండేవాడు. అజాన్ పలికే వ్యక్తి ‘అష్ హదు అన్న ముహమ్మదుర్రసూలుల్లాహ్’ చెప్పగానే, ఈ ‘అబద్ధాల కోరు’ను అల్లాహ్ అగ్గిలో కాల్చేయగాక! అని అతను అంటుండేవాడు. వారి ఇలాంటి చేష్టలకు సంబంధించి ఈ ఆయత్ అవతరించింది. ఇలాంటి ఇస్లాంశత్రువులతో నెయ్యం తగదనీ వారించింది. మరి ప్రతి ముస్లిమేతరునితో ఎంత మాత్రమూ మైత్రి తగదని ఇస్లాం చెబుతుందని మీరు అనుకోవడం శుద్ధతప్పు.

  1. ఫట్కారే హుయే (మునాఫిఖ్) బుత్ పరస్త్ జహాఁ కహీఁ పాయే జాయేఁగే పక్డే జాయేఁ, ఔర్ బురీ తరహ్ ఖతల్ కియే జాయేఁగె (33:61)

ఆయత్లో అసంపూర్ణ భాగాన్ని తీసుకున్నారు. దాంతో వారి మీద ఈ దండన, శాపం ఎందుకు విధింపబడిదనే మాట అర్థం కాలేదు. మీరు కావాలంనే ఇలా సగం అనువాదం తీసుకున్నారో లేక తెలియనందు వల్ల ఇలా చేశారో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి సంపూర్ణ ఆయత్ అనువాదం మీకు వివరంచి, మీ ఆక్షేపణకు సరైన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను.

            మరి వంచకులూ, ఇంకా మరెవరి మదిలో (కామాతురతా) రోగం వుందో, మరెవరు మదీనాలో వదంతులు రేపుతుంటారో అలాంటి వారు తమ చేష్టలను మానుకోకుంటే నిశ్ఛయంగా నీకు వారిపై ప్రాబల్యం ప్రసాదిస్తాము. ఆపై వారు నీ ముంగిట మదీనాలో చాలా కొద్ది కాలం మాత్రమే వుండగలరు. అదీ కూడా వారు ఎక్కడ దొరికితే అక్కడే చేజిక్కించుకోబడతారు, మరి హతం చేయబడతారు.

గమనించాల్సిందేమంటే ఈ సూరహ్ లో 28 నుండి 61 ఆయత్ ల వరకు మహిళల గురించి, అందులో ప్రధానంగా స్త్రీ ల పరదా గురించి ప్రస్తావనలున్నాయి. ఈ పరంపరలోనే ఒక ఆయత్ లో కపటధారులైన దుర్నడత గల వంచకుల గురించి చెప్పబడింది. అవసరార్థులై బయటకు వచ్చే గౌరవనీయ కుటుంబ స్త్రీలను వారు వేధించేవారు. ఆపై తప్పుడు వదంతులు వ్యాపింపజేస్తూండేవారు. మర్యాదస్తులైన ఆ మహిళలకు అది అవమానకరంగా వుంటుండేది. ఈ నేపథ్యంలో ఖుర్ఆన్ ఈ ఆయత్ ద్వారా వారిని అలాంటి పనులు మానుకోవాలనీ, ఈ దుశ్చేష్ఠల నుండి తమను తాము ప్రక్షాళనం చేసుకోవాలనీ లేదంటే పైన చెప్పబడిన దండనకు, శాపానికి సిద్ధంగా వుండాలని హెచ్చరించింది.

మర్యాదస్తులైన మహిళల పట్ల కామచేష్టలతో వేధింపులకు పాల్పడే వంచకులకు వ్యతిరేకంగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం చేసిన చట్టం పట్ల మీకు ఆక్షేపణ వుంది. మరి మన ప్రభుత్వాలు కూడా అదే మహిళా వేధింపు వ్యతిరేక చట్టాలు నేడు తెస్తున్నాయి కదా.. దీనిని ఏమంటారు?

అయితే నేటి చట్టాల్లోని లొసుగుల వల్ల ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. పూర్తి ఆయత్ ను మీరు తర్జుమా చేసి దాని వ్యాఖ్యానాన్ని అంతా పరిశీలించి వుంటే ఈ ఆయత్ పట్ల ఎలాంటి అపోహలకు ఆస్కారం వుండేది కాదు. ఇప్పటికైనా ఈ వివరణను మనసుపెట్టి చదివితే మీకు ఆక్షేపించేటందుకు ఏమీ మిగలదని నేను నమ్ముతున్నాను.

  1. యఖీనన్ హీ తుమ్, ఔర్ వో జిస్ కో తుమ్ అల్లాహ్ కే సివా పూజ్ తే థే, జహన్నమ్ కా ఇంధన్ హో. తుమ్ జరూర్ ఉస్కే ఘాట్ ఉత్రోగే. (21-98)

ఈ ఆయత్లో చెప్పబడినదంతా, ఇహలోకానికి సంబంధించినది గాక మరణానంతర పరలోక జీవనానికి సంబంధించినది. ఎందుకంటే ‘ఆరాధన’ అనేది కేవలం ‘అల్లాహ్’ – అంటే ఏకేశ్వరునికి మాత్రమే చెందాల్సిన హక్కు. గగనభువనాల అధికారం అంతా ఆయనదే. ఆయన లెక్కలేనంతగా,  మానవునికి తన అనుగ్రహభాగ్యాలను ప్రసాదించాడు. ఇంకా అనుక్షణం ప్రసాదిస్తూనే ఉంటాడు. అలాంటి నిత్యుడూ, శాశ్వతుడూ అయిన దయాళువును కాదని ఏమీ లేనీ, మరేమీ చేయజాలని, వారిని పూజించడాన్ని ఆ సర్వశక్తి మంతుడు ఎలా అంగీకరిస్తాడు.

  1. ఔర్ ఉస్ సే బఢ్ కర్ జాలిమ్ కౌన్ హోగా. జిసే ఉస్ కే రబ్ కీ ఆయతోఁ కే జరియే యాద్ దిలాయా జాయే ఔర్ ఫిర్ వో ఉన్ సే మూఁహ్ ఫేర్ లే (ఇస్లాం ఛోడ్దే) జరూర్ హీ హమ్ ఐసే ముజ్రిమోఁసే బద్లా లేంగే. (32-22)

ఇదే సూరా లో 15వ ఆయత్ ను చదివితే ఈ ఆయత్ అసలు అర్థం మీకు అవగతమవుతుంది. అందులో అల్లాహ్ ఇలా అంటున్నాడు.

మా ఆయత్ లను బోధించేటపుడు, ఎవరైతే సాష్టాంగపడి, తమ ప్రభువు పవిత్రతను, ఘనతనూ కొనియాడుతూ, నిగర్వులై వుంటారో అలాంటి వారే మా మాటలను నమ్ముతారు.

అంటే అల్లాహ్ పట్ల గల భీతితో, ఆయన పట్ల గల ప్రేమతో, తాను ఆయనతో అక్కరగల వాడనని ఒప్పుకొని సజ్దాలో పడతారు. నోటితో ఆయన పవిత్రతను కొనియాడతారు. హృదయపూర్వకంగా తాను దాసుడనే విషయాన్ని ఒప్పుకుంటారు. మధ్యలో తన విధేయులనూ, తిరస్కారులనూ ప్రస్తావించి 22వ ఆయత్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు.

ఎవడు, తనకు తన పోషకుని వాక్యములు బోధింపగా వాటి నుండి ముఖం తిప్పుకుని పోయాడో, అలాంటి వానికంటే పెద్ద దుర్మార్గుడెవడు వుంటాడు? ఖచ్చితంగా మేము ఇలాంటి పాపాత్ములతో బదులు తీర్చుకుంటాము.

గోయల్ గారూ! ఇంకా కొంచెం ముందు నుండి ఆయత్ లు చదివి అర్థం చేసుకొని వుంటే ఎలాంటి ఆక్షేపణకు ఆస్కారం వుండేది కాదు. ఎందుకంటే 15వ ఆయత్ లో చెప్పినట్లు తనకు విధేయులైన దాసులను కరుణించడాన్ని అలాగే మీరు చూపిన 22వ ఆయత్ లో ప్రస్తావించినట్లు దురితాత్ములపై పరమాత్ముడు ఆగ్రహాన్ని ప్రదర్శించడం అనే భావన కేవలం ఇస్లాంలోనే కాదు, అన్ని ధర్మాల్లో కూడా అంగీకృతమైనదే! కాబట్టి అన్ని మతాల విశ్వాసాల్లో కూడా ఇలానే వుంటుంది. కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే చెబుతున్న కొత్త విషయమేమీకాదు.

12-13. అల్లాహ్ నే తుమ్ సే బహుత్ సీ గనీమత్ (లూట్ కా మాల్) కా వాదా కియా హై. జో తుమ్హారె హాథ్ ఆయేఁగే తో జో కుఛ్ గనీమత్ (లూట్ కా మాల్ జైసే లూటా హువా ధన్ యా ఔరతేఁ) తుమ్ నే హాసిల్ కియా ఉసే హలాల్ వ పాక్ సమఝ్ కర్ ఖావో (ఇస్తిమాల్ కరో). (48-20; 8-69)

మీరు చేస్తున్న వ్యాఖ్యానం విడ్డూరంగా వుంది మరి! ‘ఖుర్ఆన్’ అంటే మీకు తోచినట్టు చెప్పుకోవడానికీ, నచ్చినట్టు రాసుకోవడానికీ వున్న పుస్తకం అనుకుంటున్నారా? ఖుర్ఆన్ స్పష్టంగా ‘కులూ మిమ్మా గనిమ్ తుమ్ – ‘గనీమత్’ సొమ్ములో నుండి తినండి అని చెబుతోంది. మీరు మాత్రం ‘గనీమత్’ అంటే అర్థం లూటీ చేసుకొచ్చిన సొమ్ము, స్త్రీలు అని రాసుకున్నారు. ‘మహిళలు’ కూడా తినదగినవారా?!

ఏదైనా చెప్పేటప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ప్రపంచంలో యుద్ధం జరిగిన ప్రతి సారీ, ఓడిపోయిన వాని సొత్తును విజేత స్వాధీనం చేసుకుంటాడు. ఇండో-పాక్ యుద్ధానంతరం, ఇరుదేశాలు తమదే పైచేయి అని చెప్పేటందుకు తాము స్వాధీనం చేసుకున్న ట్యాంకులను ప్రదర్శనకు వుంచాయి. దీన్ని మీరు ఏమంటారు? సిరియా పై దండెత్తిన ఇజ్రాయీల్ ‘గోలాన్’ కొండలను ఆక్రమించుకొన్నది, దీన్ని ఏమంటారు మీరు? జోర్డాన్ మీద దాడి చేసి ఇజ్రాయీల్ యెరూషలేమ్ ను ఆక్రమించుకుంటే దాంతో మొత్తం అరబ్బు దేశాలన్నీ ఒకవైపు, ఇజ్రాయీల్ మాత్రం ఒక్కటి మరోవైపు వుంది. దీనికి వ్యతిరేకంగా గొంతెత్తే ధైర్యం చేయలేని మీరు, ‘ఇస్లాం’ మీద మాత్రమే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఈ ఒక్కటి మాత్రమే ప్రశ్నించి నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను. లేదంటే ‘గనీమత్ సొమ్ము’ గురించి ఇస్లాం నిర్దేశించిన నిష్కళంక వివరాలు చెప్పుకుంటూ పోతే విషయం సుదీర్ఘమైపోతుంది.

ఆ తర్వాత రెండవ ఆయత్ లో ‘‘హలాల్’’, పరిశుద్దంగా భావించుకుని తినండి’’ అని రాసి బ్రాకెట్లో ‘వాడుకోండి’ అని కూడా రాశారు. అంటే పరిశుద్ధమైనదిగా భావించి తినడమంటే అర్థం ‘వాడుకోవడం’ అర్థం అని మీరు చెప్పాలనుకుంటున్నారు. ‘గనీమత్ మాల్’ లో మహిళలను మీ తరుపున జోడించి మీరు చేసిన తప్పును సరైంది అని రుద్దడానికి ‘ఖావో’ పదానికి భావం ‘ఇస్తిమాల్ కరో’ – వాడుకోండి అంటున్నారు. వాస్తవానికి ఖుర్ఆన్ ఆయత్ లో ఎక్కడా ఈ ప్రస్తావనే లేదు. ఇష్టమొచ్చినట్లు లేనిది వున్నట్లు, వున్నది లేనట్టు భాష్యం చెప్పుకునే రకానికి చెందిన గ్రంథం కాదు ఖుర్ఆన్. ఈ మాట నేనెందుకంటున్నానంటే ఈ ఆయత్ ‘బద్ర్’ యుద్ధానికి సంబంధించి అవతరించింది. ముస్లింలకు వ్యతిరేకులైన ఖురైష్ల మధ్య జరిగిన మొదటి యుద్ధం అది. అందులో మహిళలకు సంబంధం లేదు. ఇరువైపులా పురుషులే యుద్ధం చేశారు. మీకు పూర్వాపరాలు ఏమీ తెలియవు. దాంతో విషయ పరిజ్ఞాన లేమి, ఇస్లాం గురించి, దానికి సంబంధించిన సంఘటనల అవగాహనా లేమి కారణంతో, కేవలం ఇస్లాం పట్ల వైరీ భావన నిలువెల్లా నింపుకొని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఆక్షేపిస్తూ వున్నారు. వాస్తవానికి మీకు ఇది తగని పని.

మీరు ఇక్కడ ‘గనీమత్’ సొమ్ము అంటే లూటీ సొమ్ముగా అనువాదం చేసుకున్నారు. ఎందుకంటే మీకు ఒక్క అరబ్బీ పదం కూడా తెలియదు. ‘గనీమత్’ అంటే యుద్ధమైదానంలో గెలుపు తర్వాత హతుని దేహం నుండి తొలగించే కరవాలం మొదలగునవీ లేదా ఓటమి పాలై పారిపోతూ వదిలిపెట్టిపోయిన సామాగ్రి అని నిర్వచనం. అయితే మోసం చేసి ఎదుటి వారి నుండి దోచుకునే సొమ్ము లేదా యుద్ధపరిస్థితులు లేని శాంతి సమయంలో కబ్జా చేసుకొనే సొమ్ము గనీమత్ అనబడదు. దాన్ని ఇస్లాం, లూటీ చేయబడిన హరామ్ సొమ్ము అంటుంది. ఆ సొమ్ము ముస్లింది అయినా లేదా ముస్లిమేతరునిదైనా అది హరామ్ గానే ఎంచబడుతుంది. కానీ మీరు మాత్రం ‘గనీమత్’ సొమ్మంటే దోపిడీ సొమ్ము అని అనువదించారంటే అరబీ భాషా పరిజ్ఞానం, మీకు ఏ మాత్రం లేదనేటందుకు ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.

అంతేగాక మీకు తెలియాల్సిన మరో విషయం కూడా ఏమంటే – ‘గనీమత్’ సొమ్ము అనేది మస్లిమేతరులు ఓడిపోతే ముస్లింలకు దక్కినట్లే, ముస్లింలు ఓటమి పాలైతే ముస్లిమేతరులకు కూడా అది దక్కుతుంది. ఇదే లోక రీతి మరి.

  1. అయ్ నబీ, కాఫిర్ ఔర్ మునాఫిఖోఁ కే సాథ్ జిహాద్ కరో (దహ్షత్ గర్ద్ బన్ కర్ గైర్ ముసల్మాన్ కా ఖతల్) ఔర్ ఉన్ పర్ సఖ్తీ కరో ఔర్ ఉన్ కా ఠికానా జహన్నమ్ హై ఔర్ వో బురీ జగా హై జహాఁ వో పహుంచే. (26-9)

నేను ఇప్పటికే చాలా సార్లు, మీకు ఖుర్ఆన్, దాని వివరణల పట్ల బొత్తిగా పరిజ్ఞానం లేదని చెప్పాను. ఒక వేళ ఏమాత్రం వున్నా ఈ ఆయత్ ను మీరు ఆక్షేపించరు.

ఈ ఆయత్ లో ‘జిహాద్’ అంటే కత్తితో చంపడమనే అర్థాన్ని మీరు మీ తరపు నుండి తీసుకొచ్చారు. ఆ పై బ్రాకెట్లలో దాని భావం ‘ఉగ్రవాదిగా తయారై ముస్లిమేతరులను చంపడం’ అని రాసేశారు. ఇక్కడ ఈ ఆయత్ లో జిహాద్ అంటే చంపడమనే అర్థమే పొసగదు, ఎందుకంటే అది ఇస్లామీయ సూత్రాలకు విరుద్ధం.

కొంచెం వివరంగా చెబుతా వినండి – ‘నబీ’ లేదా ‘రసూల్’ అనబడే వారు ఎలాంటి స్థితిలోనూ అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకోలేరు. అల్లాహ్ ఆజ్ఞల ఉల్లంఘనకు పాల్పడని వారూ, పాపం ఎరుగని వారు మాత్రమే ‘నబీ’, ‘రసూల్’ అవుతారు. ప్రాణం ధారపోస్తారేమోగానీ, అల్లాహ్ ఆజ్ఞకు ఇసుమంతైనా విరుద్ధంగా నడుచుకోజాలరు అనేది ఇస్లామీయ విశ్వాసాలకు సంబంధించిన ప్రాథమిక సూత్రం. ఇందులో ముస్లింలకు రవ్వంత సందేహానికి కూడా తావుండదు.

ఇక ఈ ఆయత్ ను గమనించండి. ఇందులో ఆజ్ఞాపించేవాడు ‘అల్లాహ్’. ఆజ్ఞపించబడేది ‘నబీ’, ఆదేశించబడే విషయం ‘కాఫిర్ లతో, మునాఫిఖ్’లతో జిహాద్ చేయాలని! మరి మీరన్నట్టు జిహాద్ అనే పదానికి కత్తితో సంహరించడమే అయితే మొత్తం 23 యేళ్ళ కాలంలో ఏదో ఒక్కసారైనా మునాఫిఖ్ లను వధించడం, యుద్ధం చేయడం అనే పని రసూలుల్లాహ్ ఖచ్చితంగా చేసివుండేవారు. కానీ మునాఫిఖ్ లపై కత్తి దూసిన సంఘటన ఎక్కడా చరిత్రలో అగుపించదు. వాస్తవానికి మునాఫిఖ్ లు ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. ఎంతో దిగజారుడు చేష్టలు చేశారు. అయినప్పటికీ ఎన్నడేగానీ హజ్రత్ ముహమ్మద్ (స) తాము స్వయంగా వారిపై కత్తి దూయలేదు. ముస్లింలను కత్తి ఎత్తాలని ఫరమాయించలేదు. ‘జిహాద్’ అనే అరబీ పదానికి ‘అవిశ్రాంత ప్రయత్నం’ అని అర్థమని మీరు ఎరుగరు. ఈ ఆయత్ లో ప్రస్తావించిన సూత్రం ప్రకారం ఇక్కడ జిహాద్ పదానికి పైన చెప్పబడిన ప్రధాన అర్థమే అన్వయిస్తుంది. మీరన్నట్టు యుద్ధం ఏమాత్రం కాదు. పవిత్ర ఖుర్ఆన్ లో ఇంకా మరెన్నో చోట్ల ఈ జిహాద్ పదం యుద్ధం అని గాక ‘అవిశ్రాంత కృషి’ అనే ప్రయోగించబడింది. కాబట్టి ఈ ఆయత్ అర్థం – ఓ ప్రవక్తా ! కాఫిర్లతో, మునాఫిఖ్ లతో వాక్కు ద్వారా జిహాద్ చెయ్యి. అంటే ఏకేశ్వరోపాసన, ఇస్లామీయ విశ్వాసాలకు, సదాచరణకు కట్టుబడే విధంగా వారికై అవిరామంగా ప్రయత్నించు. వారు దుశ్చేష్టలకు పాల్పడినపుడు ఇస్లామీయ – షరీఅత్ ఆదేశాలను జారీ చేయడానికి ఎలాంటి రాయితీలకూ మెతక వైఖరికీ పాల్పడవద్దు. అని భావం. అందుకే వారందరూ ‘ఈమాన్’ గైకొనడానికి హజ్రత్ ముహమ్మద్ (స) తమ ప్రాణాలొడ్డి ప్రయత్నించారని చెప్పవచ్చు. ఖుర్ఆన్లో 18-6, 26, 26-3, 35-8 ఈ మూడు చోట్ల ముహమ్మద్ (స) ను సముదాయిస్తూ.. ఓ ముహమ్మద్! వారు ఈమాన్ పుచ్చుకోలేదన్న విచారంతో నువ్వు నీ ప్రాణాలను ఫణంగా పెడ్తావేమో అన్నట్లుగా వుంది.  అని అల్లాహ్ అంటున్నాడు.

ఇంతగా మీకు వివరించిన దాని సారాంశం ఏమంటే ఈ ఆయత్ లో ‘జిహాద్’ అనే పదానికి అర్థం ‘యుద్ధం’ కానే కాదు, అవిశ్రాంత కృషి అని మాత్రమే! మరి మంచి కోసం నిరంతర ప్రయత్నం మంచి పనే అవుతుందిగానీ చెడ్డపని ఎంతమాత్రం కాదు గదా!.

  1. తో జరూర్ హమ్ కుఫ్ర్ కర్నే వాలోఁకు (ఇస్లాంకు ధోకా దేనే వాలోఁకు) సజా కా మజా చఖాయేఁగే ఔర్ హమ్ ఉన్హేఁ సబ్ సే బురా బద్లా దేంగే. ఉస్ కామ్ కా బద్లా జో వో కర్తే థే. (41-27)
  2. యే బద్లా హై అల్లాహ్ కే దుష్మనోఁకా (జహన్నమ్ కి) ఆగ్. (గైర్ ముస్లిమోఁ కో నరక్) ఉసీ మే ఉన్ కి సజా కా ఘర్ ఉస్ కే బద్లే మే కే హమారి ఆయతోఁకా ఇన్కార్ (ఇస్లాం ఔర్ ఖుర్ఆన్ కొ నహీఁ అప్నాయా) కర్తే థే. (41-28)

ఇది విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ‘వంచన’ అనడం అతిశయోక్తి కాదేమో! మీరు ఈ సూరా లో 27,28 ఆయత్ ల తర్జుమా మాత్రం తీసుకున్నారు. వాస్తవానికి ఈ రెండు ఆయత్ లు అంతకు ముందరి ఆయత్ లో చెప్పబడిన అంశాలకు పర్యవసనాలు – ఫలితం మాత్రమే విశదం చేస్తున్నాయి. అంటే మీరు మునుపటి ఆయత్ లో చెప్పబడిన పాపాలను పక్కన బెట్టి, వాటిని చేయడం వల్ల విధించబోయే శిక్షను మాత్రం చూపెడుతున్నారు. మూర్తి పూజకులందరినీ ఇస్లాం – ఖుర్ఆన్ నిష్కారణంగా నరకానికి అర్హులు అంటుందని ఎలాగోలా తేల్చేయాలని మీ ఈ ఊబలాటం అంతా! కాబట్టి విషయ సృష్టీకరణ కోసం ముందరి ఆయత్ లో చెప్పబడిన పాపాల గురించి మీకు తెలపాలనుకుంటున్నాను. దాంతో 15,16 వ క్రమ సంఖ్యలోని ఆయత్ లో పేర్కొన్న శిక్ష ఎందుకనేది తెలుస్తుంది. మీరైతే దాన్ని ఇచ్చాపూర్వకంగానే వదిలేసారనేది వాస్తవం.

దీని తర్వాత క్రమ సంఖ్య 15,16 లోని రెండు ఆయత్ లలో వారి ఈ దుష్కృత్యాలకు శిక్ష చెప్పబడింది. మీరు ఆ శిక్షను మాత్రమే బయటకు చెపుతున్నారు. వారి దుశ్చేష్ట ను మాత్రం దాచి పెడుతున్నారు.

మాటలకు అందని రీతిలో ఖుర్ఆన్ తన ప్రభావం చూపుతుంది. నాడు కాస్తో కూస్తో ఖుర్ఆన్ అర్థం తెలిసిన ఇస్లాం బద్ధశత్రువులైన అరబ్బులు ఆ ఆయత్ లు విన్నంతనే ఈమాన్ పుచ్చుకునేవారు. ఇక స్వయంగా హజ్రత్ ముహమ్మద్ (స) ఖుర్ఆన్ పారాయణం చేస్తుంటే, దాని ప్రభావం మరింత అమోఘంగా వుండేది. ఒక్క మనుషులే ఏమి, అంతకు మించి జిన్నులు సైతం ప్రభావితమై ఈమాన్ స్వీకరించేవి.

ముహమ్మద్ (స) ను చంపాలని బయల్దేరిన హజ్రత్ ఉమర్ (రజి) తన చెల్లెలి ఇంట్లో కొన్ని ఆయత్ లు పఠించారో లేదో పరివర్తన చెందారు. చంపాలని బయల్దేరిన వ్యక్తి ప్రవక్త (స) పాదాల చెంత వాలి పోయారు.

ఇథియోపియా క్రైస్తవ రాజైన నజ్జాషి కొన్ని ఖుర్ఆన్ ఆయత్ లు విన్నంతనే ఇస్లాం పుచ్చుకున్నాడు. కేవలం కొన్ని ఆయత్ లు వినినంతనే షిర్క్ – కుఫ్ర్ ల నుండి తొలగి హృదయపూర్వకంగా ఏకేశ్వరోపాసనను అంగీకరించిన ఉదంతాలు అనేకం వున్నాయి. అందుకే ఖుర్ఆన్ పఠనం జరుగుతున్నప్పుడు కోలాహలం రేపి, చప్పట్లు చరుస్తూ గందరగోళం సృష్టించి తమకూ వినపడరాదు, ఇతరులు కూడా వినరాదని మక్కాతిరస్కారులు కుతంత్రాలు చేసేవారు.

7వ సూరహ్ 204 ఆయత్లో అల్లాహ్ – ‘‘ఖుర్ఆన్ పఠనం జరుగుతుంటే దాన్ని వినండి, మరి నిశ్శబ్ధంగా వుండండి’’ అని సెలవిచ్చాడు. వీరు మాత్రం ఆ ఖుర్ఆన్ తమ చెవుల్లో లేదా ఇతరుల చెవుల్లో పడిందంటే దాని ప్రభావంతో కుఫ్ర్ విడిచిపెట్టి ఈమాన్ లో చేరిపోతామేమోననే భయం తో చప్పట్లు చరుస్తూ కేకలు పెట్టేవారు. దైవ గ్రంథాన్ని హేళన చేయడం, సన్మార్గాన్ని అడ్డుకోవడం అనేవి అల్లాహ్ కు ఆగ్రహం తెప్పించే కారకాలు. అదే అంశాన్ని అల్లాహ్ ఈ ఆయత్ లో స్పష్టం చేశాడు.

మరో సంగతి కూడా గమనించాలి. క్రమ సంఖ్య 15 లో అనువాదం చేస్తూ ‘‘ఖచ్చితంగా మేము కుఫ్ర్ చేసేవారిని (అంటే ఇస్లాంను మోసగించే వారిని)’’ అని వ్రాశారు. ఈ బ్రాకెట్లలో మీరు రాసిందేమిటో? ఇక్కడ ఇస్లామ్ ను మోసగించే మాట ఎక్కడి నుండి వచ్చిందో, ఎన్ని సార్లు చదివినా, ఎంతగా పరిశీలించినా అర్థం కావడం లేదు. ప్రియమైన గోయల్ గారూ! ఈ పొంతన లేని ‘‘బ్రాకెట్’’ ఎక్కడి నుంచి వచ్చివాలిందో మరి ! మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి.

ఇంత వరకూ క్లుప్తంగా అయినప్పటికీ ఆవశ్యక వివరాలు వ్రాశాను. ఈ ఆయత్ లో, దీని తర్వాతి ఆయత్ లో చెప్పబడిన ‘దండన’ – సామాన్య కాఫిర్లందరికీ వర్తించేది కాదు. కేవలం ఎవరైతే ముందు ఆయత్ లో ప్రస్తావించబడిన దుష్కర్మలను చేస్తూ వుండేవారో, మనుషులను సన్మార్గానికి రాకుండా అడ్డుకుంటూ వుండేవారో వారిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది.

  1. బేషక్ ఈమాన్ వాలోఁ (ముసల్మానోఁ) సె ఉన్ కే జాన్ ఔర్ మాల్ కొ ఉస్ కే బద్లే మే ఖరీద్ లియా హై కే, ఉన్ కే లియే జన్నత్ హై. వో అల్లాహ్ కే రాస్తే మే లడ్తే హైఁ. వో మార్తే భీ హైఁ. (ఇస్లామ్ ఫైలానే కే లియే దహ్షత్ గర్ద్ బన్ కర్ గైర్ ముస్లిమోఁకు మార్నా వ జబ్రన్ ఇస్లామ్ ఖబూల్ కర్వానా) ఔర్ మారే భీ జాతే హైఁ. (9-11)

యుద్ధం – సంహారం అనే పదాలు ఖుర్ఆన్ లో ఎక్కడ ప్రస్తావించబడినా అది కాఫిర్ లందరినీ లేదా విగ్రహారాధకులందరినీ ఉద్దేశించి చెప్పబడ్డాయని మీరు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు, అంతేగాక ఇస్లాం మీద మోపుతున్న అపనింద మాత్రమే. సూరహ్ 60 లో 8,9 ఆయత్ లు చదివి అవగాహన చేసుకోండి. సమరం – సంహారం అనే పదాలు ఖుర్ఆన్ లో ఎక్కడ చెప్పబడినా దాని ఉద్దేశ్యం, ముస్లింలను ప్రశాంతంగా బ్రతక నివ్వక, వారి ప్రభుత్వాలను కూలదోయ ప్రయత్నించే వారు మాత్రమే గానీ ఎవరైతే సామరస్యంగా సహజీవనం చేస్తారో వారి పట్ల ఇస్లాం ‘జీవించు – ఇతరులను కూడా జీవించనివ్వు’ అనే సూత్రానికి కట్టుబడి వుంటుంది. ‘హుదైబియా’ అనే చోట జరిగిన ఒడంబడిక మూర్తిపూజకులైన మక్కా ఖురైషులతో జరిగింది. అందులో ‘బ్రతుకు – బ్రతకనివ్వు’ అనే పై సూత్రం పూర్తిగా ఆచరణాత్మకంగా మస్లింలచే ప్రదర్శితమయ్యంది. ఈ వివరణ అంతా క్రమసంఖ్య 1 లో క్లుప్తంగా చర్చించబడింది. ఇస్లాంకు ముస్లింలకు విరోధులైన ఇలాంటి వారితో ప్రాణాలు ఫణంగా పెట్టి ముస్లింలు ప్రతిఘటించాలని ఈ ఆయత్ లో కూడా చెప్పబడుతోంది. మీరు భావించుకుంటున్నట్టు మతం ప్రాతిపదికన యుద్ధ ప్రస్తావన పూర్తిగా తప్పు. సూరహ్ – 9 ఆయత్ 36 ను (మీతో ఎలాగైతే ఆ ముష్రిక్ లందరూ యుద్ధం చేస్తున్నారో మీరందరూ కూడా వారితో పోరాడాలి). సూరహ్ – 2 ఆయత్ 190ను (దైవమార్గంలో మీతో యుద్ధం చేసే వారితో మీరూ యుద్ధం చేయండి). చదవండి- ఇక్కడ ముస్లింలతో పోట్లాడే వారితో యుద్ధం చేయాలని ఖుర్ఆన్ ఆదేశిస్తుంది. మరి కల్లోల కలహాలకు దూరంగా ప్రశాంతంగా జీవించే వారి పట్ల సద్వ్యవహారం చేయాలనీ, ఉత్తమ రీతిలో మెలగాలనీ 60–8,9 ఆయత్ లలో స్పష్టంగా ఆదేశించబడింది.

నేను అనుకుంటున్నదేమంటే ఈ అనువాదం చేసిన వ్యక్తి ఎవరోగానీ అతను మాత్రం చీటికీ, మాటికీ బ్రాకెట్లు పెట్టి అందులో ‘ఉగ్రవాదులు’ అని రాస్తూ ముస్లింల పై నిందారోపణలు చేస్తూ కడుపుమంట చల్లార్చు కోవాలని మాత్రమే అనుకుంటున్నాడు. కానీ అడుగడుగునా తాను అరబీ భాషా వ్యాకరణం, ఖుర్ఆన్ సందర్భోచితంగా ప్రస్తావించిన భావాలను ఏ మాత్రం తెలియనీ, తెలుసుకోలేని వాడినని రుజువు మాత్రం చేసుకుంటున్నాడు.

  1. అల్లాహ్ నే ఉన్ మునాఫిఖ్ మర్దోఁ ఔర్ ఔరతోఁ ఔర్ కాఫిరోఁ సే జహన్నమ్ కి ఆగ్ కా వాదా కియా హై జిస్ మే వో హమేషా రహేఁగే, యహీ న్షేఁ బస్ హై. అల్లాహ్ నే ఉన్హేఁ లానత్ కీ, ఔర్ ఉన్ కే లియే మస్తఖిల్ సజా హై. (9-68)

ఇక్కడ కొంచెం వివరణ అవసరమవుతుంది. అరబీలో ‘కుఫ్ర్’ అంటే తిరస్కరణ అని అర్థం. ఏకేశ్వరుణ్ణి తిరస్కరించే వాడిని కాఫిర్ అంటారు. బాహాటంగా లేదా అంతర్గతంగా ఆ ఏకైక పరమాత్మునికి అతను విధేయత చూపడు. ‘మునాఫిఖ్’ అంటే – మదిలో కుఫ్ర్ (అనేక దేవుళ్ళను) దాచి పెట్టకొని, అందరి ముందర మాత్రం ప్రాపంచిక ప్రయోజనం ఆశించి ఏకేశ్వరుణ్ణి ప్రస్తుతిస్తాడు. అంటే కాఫిర్ – మునాఫిఖ్ ఇరువురూ విశ్వాసాల పరంగా చూస్తే సమానమే. కానీ బయట చూడ్డానికి ఇరువురూ వేరువేరుగా అగుపిస్తారు. ఇద్దరి భావన ఒక్కటే. దాంతో బాటు ఒకే విశ్వ ప్రభువును వీరు నమ్మరు. కాబట్టి ఖుర్ఆన్ ఈ ఆయత్ లొ మునాఫిఖులైన స్త్రీ పురుషులతో కుఫ్ర్ చేసే వారిని కూడా కలిపి ప్రస్తావించింది. కాదంటే 21వ ఆయత్ నుండి ప్రత్యేకించి మునాఫిఖ్ ల గురించే చెప్పబడింది. 21వ ఆయత్ నుండి మీరు పరిశీలానాత్మకంగా చదివి చూడండి. వీరంతా తమ కుఫ్ర్ తో బాటు దైవ సందేశహరుడైన ముహమ్మద్ (స) ను బాధలకు గురిచేసేవారు. ఆయనను హేళన చేసేవారు. అబద్దాలాడేవారు, అబద్ధపు ఒట్టు పెట్టకునేవారు, పాపపు పనులు చేయాలని ప్రజలకు ఆదేశించేవారు, మంచి పనుల నుండి అడ్డుకునేవారు, పేదలను, అవసరార్థులను ఆదుకునేవారు కాదు. ఇన్ని దుశ్చేష్టల మూలంగానే అల్లాహ్ వారి పట్ల అప్రసన్నుడై అత్యంత కఠినంగా శిక్షించే సంగతి చెబుతున్నాడు. మరి మీరు మాత్రం ఈ ఆయత్ ను మొత్తం విషయం నుండి పక్కకు తెచ్చి చూపుతూవున్నారు. తమ పరువు పై దెబ్బ వేసినట్టు భావించుకుంటున్నారు లేదా మొత్తం విషయం నుండి ఈ ఒక్క ఆయత్ను వేరు చేసి ఏదో పేరు సంపాదించాలని భ్రమిస్తున్నారు. ఈ ఆయత్ ను మునుపటి ఆయత్ లతో కలిపి చదివితే, ఇందులో చెప్పబడిన కఠిన శిక్ష వారి ఘోరాతి ఘోర పాపాల ఫలితమేనని – అర్థం అవుతుంది.

  1. అయ్ నబీ! ఈమాన్ వాలోఁ (ముసల్మానోఁ)కు లడాయి పర్ ఉభారో, అగర్ తుమ్ మే 20 జమే రహ్నే వాలే హోఁగే, తో వో 200 పర్ గలబా హాసిల్ కర్లేఁగే. ఔర్ అగర్ తుమ్ మే 100 హోఁ తో ఏక్ హజార్ కాఫిరోఁ (గైర్ ముస్లిమోఁ) పర్ గాలిబ్ రహేఁగే. (8-65)

ఈ ఆయత్ కు మునుపటి, ఆ తర్వాతి ఆయత్ లు చదివితే ఇందులో ముస్లింలకు – మక్కా విగ్రహారాధకులకు జరిగిన తొలి యుద్ధం ‘బద్ర్’ గురించి చెప్పబడిందని అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం వివరించడం అవసరమనే అనుకుంటున్నాను. దైవసందేశహరుడు హజ్రత్ ముహమ్మద్ (స) వెంటనున్న కొద్దిపాటి 313 మంది అనుచరుల్లో ఎక్కువ మంది వ్యవసాయం చేసుకునే మదీనా వాసులు, వారంతా యుద్ద తంత్రాలు ఎరుగనివారు. యుద్ధసామాగ్రి గానీ, ఆయుధాలు గానీ వారి వెంట లేవు. అసలు వారు యుద్ధం చేయడానికి పయనమవ్వలేదు. అందుకు భిన్నంగా ప్రత్యర్థులైన మక్కా ఖురైషులు వెయ్యిమంది వచ్చారు. వారంతా కాకలు తీరిన యోధులు. అరబ్బు దేశమంతా వారి ధైర్యస్థ్యైర్యాల చర్చలతో మారుమోగుతుండేది. అన్ని రకాల ఆయుధాలతో యుద్ధసన్నధ్ధులై కదనరంగానికి వారు వచ్చారు. ఇది ప్రవక్తగారికి విషమసందర్భం. సొంత ఊరు మక్కా వదిలి మదీనాకు తామందరం వచ్చాము. ఇక్కడి వారంతా మనఃపూర్వకంగా తమను ఆదుకున్నారు. దాంతో నిర్భీతిగా దైవసందేశ కార్యం ముందుకు తీసుకుపోగలిగాము. మరి ఇప్పుడేమో సమరాన మాతో బాటు పాల్గొంటున్నారు. తమతోబాటు మీరుకూడా యుద్ధం చేయాలనే ఎలాంటి కట్టుబాటు, ఒడంబడిక లేదు. ఖురైషు సైన్యానికి వెన్ను చూపి పారిపోవడం తప్ప గత్యంతరం లేదా అనే పరిస్థితి కనబడుతోంది. మరోవైపు అలా పారిపోవడం దైవ సందేశవాహకుని ఔన్నత్యానికి తగని పని. అలా వెన్నుజూపి వెనక్కు తగ్గితే ఇక ఎన్నడూ మక్కా వారికి వ్యతిరేకంగా కదనరంగంలో కాలు పెట్టడం దాదాపు అసంభవం అన్నట్టు! అందుకే హజ్రత్ రసూలుల్లాహ్ (స) ముహాజిర్ లు తక్కువగానూ, అన్సారులు అధిక సంఖ్యలో వున్న తమ సైనికులను వుద్దేశించి, ప్రస్తుత తరుణంలో ఈ సంగ్రామం, అందులో జరగబోయే సంహారం గురించి మాటికి మాటికి అడగసాగారు. చివరకు మదీనా అన్సార్లకు రసూలుల్లాహ్ (స) గారి మాటల అంతరార్థం అర్థం అయ్యింది. వారి నాయకుడు ముందుకు వచ్చి ఓ రసూలుల్లాహ్! మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరు ఆదేశిస్తే మేం మా అశ్వాలను చావుకు వెరవక సముద్రాల్లోకి దౌడు తీయిస్తాం! మళ్ళీ వెనక్కు వచ్చే ప్రసక్తే వుండదు. మిమ్మల్ని విడిచి పారి పోయే వాళ్ళం మాత్రం కాదు. ఇది వినినంతనే హజ్రత్ ముహమ్మద్ (స) ముఖం ఆనందంతో గులాబీ పువ్వులా విరిసింది. ఇదే సమయంలో అల్లాహ్ ఇలా సందేశం పంపాడు.. ‘‘ఓ ప్రవక్తా! ఖురైషుల అపార సేనా బలగాన్ని చూసి భయపడవద్దు. వారి యుద్ధ సన్నద్ధత జూసి మీ ఆయుధ లేమి పట్ల భీతి చెందవద్దు. సమరాంగణాన అల్లాహ్ సాయపడితేనే ‘జయం’ దక్కుతుంది. నిన్ను సఫలుణ్ణి చేసి తీరతానని నీకు మాటిస్తున్నాను. కాబట్టి ఖురైషు బలగాలతో పోరాడేటందుకు తన వారిని సమయాత్తం చేయి. వారిలో ఉత్తేజం నింపు. భయాందోళనలు దరికి రానివ్వకు. నేనే వారిని సంరక్షిస్తా. శత్రువులను అవమానకర రీతిలో నేలపాలు జేస్తా. తొలి సంగ్రామం లోనే వారి నడుములు కూల్చేస్తా’’!

అసలు నేపథ్యం ఇలా వుంటే మీరు మాత్రం ఈ ఆయత్ కు ఇంకొక అర్థం ఊహించుకుంటున్నారు. ముస్లిములను అన్ని వేళలా పోట్లాడేటందుకు రెచ్చగొట్టాలనీ, తద్వారా ముస్లిమేతరులెవ్వరు ప్రశాంతంగా బ్రతకరాదని చెపుతున్నట్టు మీకై మీరు భావించుకుంటున్నారు. ఇదంతా ఇస్లాంకు వ్యతిరేకంగా సాగించే దుష్ప్రచారం తప్ప మరేమీ కాదు. ఇస్లాం సహజీవనం – సమ భావనలే బోధిస్తుంది. ఖుర్ఆన్ లో 4-90 ఒకసారి చదవండి. దాంతో బాటు మరి ఎవరైతే శత్రువుగా వ్యవహరిస్తారో, మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరో, అనవసరంగా యుద్ధాన్ని మీపై రుద్దాలనుకుంటారో అలాంటి వారితో మాత్రం ఉక్కుగోడల మాదిరి స్థైర్యంగా నిలబడి ఎదుర్కోవాలని కూడా అది చెబుతుంది.

  1. అయ్ ఈమాన్ లానే వాలో! తుమ్ యహూదియోఁ ఔర్ ఈసాయియోఁసే దోస్తానా తాల్లుఖ్ నా బనావో. (5-51)

మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తితోనూ ఉత్తమంగా మెలగాలని ఖుర్ఆన్ ముస్లింలకు అనునిత్యం బోధిస్తుంది. అయితే మైత్రి పేరుతో తమ అంతర్గత, సాంఘీక, సైనిక రహస్యాలను ఎదుటి వారికి తెలియజెప్పేటంతగా ముస్లింలు బంధాలను పెంచుకోరాదని కూడా అడ్డుకుంటుంది. ఇదే విషయం 3-118,119,120 ఆయత్లలో మనం చూడవచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా ఇదే జరిగింది. బనూఖురైజ అనే యూదు తెగతో ముహమ్మద్ (స) మదీనాకు వచ్చిన తర్వాత ఒక ఒడంబడిక చేసుకున్నారు. తామిరువురూ పరస్పరం పోట్లాడుకోరాదనీ, ఎవరైనా దాడి చేస్తే ఆ దాడి చేసే వానికి సహకరించరాదనీ, శత్రువు ఎవరైనా సరే ఇరువురం కల్సి ఎదుర్కోవాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ యూదులు ఒప్పందం ఉల్లంఘించారు. వెళ్ళి మక్కా ఖురైషులను ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, ముస్లింలపై దాడి చేస్తే మేము మీకు సాయం చేస్తామని మాటిచ్చారు. ఈ సందర్భంలో జరిగిన యుద్ధానికి అహ్జాబ్ సంగ్రామమని పేరు. కొంత మంది సాదా సీదా ముస్లింలతో ఈ యూదులకు స్నేహం వుండేది. ఆ అమాయక ముస్లింలతో వీరు రహస్యాలు తెలుసుకుంటుండేవారు. యుద్ధ సమయంలో్ ఈ విధంగా అంతర్గత రహస్యాలు ఇతరులకు తెలియడం నష్టదాయకం అవుతుంది. కాబట్టి జాతి భద్రత, సైనిక రహస్యాలు శత్రువుకు చేర వేసేటంతగా సాన్నిహిత్యం పెంచుకోరాదని ఆదేశించబడింది. ఈ ఆదేశంలోనూ ఆపత్కర పరిస్థితుల్లో ఒకరినొకరు ఆదుకోరాదని ఎంత మాత్రం చెప్పడం లేదు. కేవలం, జాతికి, సమాజానికి నష్టదాయకం కాగల రహస్యాలు చేరవేసేటంతటి స్నేహితం నుండి దూరంగా వుండాలని మాత్రమే చెప్పబడింది. సమకాలిన ప్రపంచంలో కూడా ఇదే జరుగుతుంది. దేశ భద్రతకు సంబంధించి లేదా సైన్య రహస్యాలు ఇతరులకు చేరవేసే వారికి కఠినాతికఠిన శిక్షలు అమలు చేయబడతాయి.

  1. ఉన్ సే లడో యహాఁ తక్ కే వో జలీల్ హోకర్ అప్నే హాథోఁసే జిజియా దేనే లగేఁ. (9-29)

జిజియ పదం చూడగానే గోయల్ గారు మీరు ఖుర్ఆన్ పై ఆరోపణ చేయాలనుకుంటున్నట్లుంది. జిజియా అంటే ముస్లిమేతరుల నుండి టాక్స్ వసూలు చేయడం అని మీరు రాసుకొచ్చారు. వాస్తవానికి మీరు చేసుకున్న తర్జుమా శుద్ధ తప్పు. దాని వాస్తవికత మీరు ఎరుగరు. ఇస్లాం విరోధులైన యూరోపు రచయితల పుస్తకం ఏదో ఒకటి చదివి అదే పాఠం మీరు కూడా వల్లెవేస్తున్నారు. ఆ యూరపియన్ ఇస్లాం విరోధులు కూడా వక్రార్థాలు ప్రచారం చేస్తూ చేస్తూ చివరకు పరలోకానికి పయనమైపోయారు. ప్రామాణిక విషయం ఏమిటో నేను చెబుతాను ధ్యాసగా చదవండి.

ఇస్లామీయ రాజ్యంలో వుండే సైనిక బలగం అంతా ముస్లింలదే అయ్యుంటుంది కదా. అక్కడ నివసించే ముస్లిమేతరులకు ఆ సైన్యంలో చేరడం తప్పని సరి కాదు. ఈ ఇస్లామీయ సేనలు సామ్రాజ్యంలోని ముస్లిం పౌరుల రక్షణ బాధ్యత తీసుకుంటాయి. సైనిక బలగాలకు ఆయుధ సామాగ్రి సమకూర్చడానికీ, ఇతర అవసరాలు తీర్చడానికి బైతుల్మాల్ రూపంలో ఇస్లామీయ బ్యాంక్ ఏర్పాటు, జకాత్, సదఖ, ఉష్ర్ మొదలగు మార్గాల ద్వారా ముస్లింలు ఆర్థిక వనరులు సమకూర్చుతారు. ఇదే సమయంలో మరోవైపు ఆ ఇస్లామీయ ప్రభుత్వం మస్లిం పౌరుల రక్షణా బాధ్యత తీసుకున్న రీతిలో ముస్లిమేతరుల సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటుంది. హజ్రత్ ముహమ్మద్ (స) ముస్లిమేతర పౌరుల గురించి ఇస్లామీయ రాజ్య ప్రభుత్వానికి 15 నిబంధనలు పాటించేటట్టు ఆదేశించారు. అందులో ‘ఏ శత్రువైనా వారిపై దాడి చేస్తే ఆ ముస్లిమేతర పౌరుల తరుఫున యుద్ధం చేయాలి’. ఇది మొట్టమొదటి నియమం. మరి ఆ ఇస్లామీయ సైనిక బలగాలకు మస్లింలు జకాత్ సదఖా ఉష్ర్ రూపంలో నిధులు సమకూర్చుతారు. అయితే మస్లిమేతర పౌరులు మాత్రం ప్రయోజనమైతే పొందుతారు. కానీ, తమకు రక్షణగా నిలబడే సైనిక బలగాలకు దన్నుగా నిలబడి వనరులు మాత్రం సమకూర్చడం లేదు. ముస్లిమేతరులకు జకాత్ చెల్లించాల్సిన బాధ్యత ఎంత మాత్రం లేదు. అది కేవలం ముస్లింల ధార్మిక విధి మాత్రమే! అలాంటప్పుడు సైనికావసరాల కోసం మస్లిమేతర పౌరులపై విధించబడినదే జిజియా. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఏ కారణంగానైనా ఇస్లామీయ రాజ్యం ఎప్పుడైతే తన మస్లిమేతర పౌరుల సంరక్షణ చేయలేకపోతుందో, అప్పడు జిజియా వసూలు చేయరాదు. అసలు జిజియా వసూలు చేసే హక్కు కూడా ఇస్లామీయ రాజ్యం కోల్పోతుంది.

హజ్రత్ ఉమర్ (రజి) పాలనాకాలంలో హజ్రత్ అబూ ఉబైద (రజి) సిరియా ను జయించారు. రోము పాలకుడైన హిర్ఖల్ పెద్దసైన్యాన్ని సిద్ధం చేసి ముస్లింలపై దాడికి ఆదేశించాడు. ఆ సమయంలో ముస్లింలు తమ సర్వశక్తులూ, వనరులూ అన్నీ ఆ దాడిని ఎదుర్కొనేటందుకు ధార పోయాల్సి వచ్చింది. దాంతో సిరియా లో ఆనాడు జిజియా చెల్లిస్తూవున్న ముస్లిమేతర పౌరుల సంరక్షణా బాధ్యత ముస్లిం సేనల శక్తికి మించిన భారం అయ్యింది. దాంతో అక్కడి గవర్నర్లందరికీ జిజియా వాపసు చేయాలనీ, తాము ఈ పరిస్థితుల్లో పౌరులను సంరక్షించలేమని అందుకే జిజియా వాపసు ఇస్తున్నామని చెప్పాలని ఆదేశాలివ్వబడ్డాయి. దాంతో ఆ ముస్లిమేతర పౌరులైన క్రైస్తవులు ఇస్లామీయ రాజ్యం సుస్థిరంగా, సుభిక్షంగా వుండాలని ప్రార్థనలు చేశారు. ఒకవేళ ఈ పరిస్థితుల్లో ముస్లింలు గాక రోమనులు వుండి వుంటే మా సొమ్ము వాపసు ఇవ్వడం అటుంచి మా దగ్గర వున్నదంతా కూడా దోచుకునే వారు అని చెప్పసాగారు.

అలాగే ఇంకొక విషయం కూడా ఉంది. ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతర పౌరులు తమ అభీష్టం మేరకు స్వచ్ఛందంగా ఇస్లామీయ సైన్యం లో చేరితే ఆ సందర్భంలో కూడా వారితో ఎలాంటి జిజియా తసుకోబడదు.

హజ్రత్ ఉస్మాన్ రజి. పాలనా కాలంలో హబీబ్ ఇబ్నే ముస్లిమ అనే ముస్లిం సేనాని ‘జరాజిమ’ అనే క్రైస్తవ తెగను జయించాడు. ఆ క్రైస్తవులు అవసరం వస్తే తాము ముస్లిం సేనలతో కల్సి శత్రువుతో యుద్ధం చేస్తామని ముందుకు వచ్చారు. ఆ కారణంతో ఆ తెగ మొత్తం ముస్లిమేతరులైనప్పటికీ వారి నుండి జిజియా వసూలు చేయలేదు. ఆ తర్వాత దాదాపు నూటయాభై, రెండువందల సంవత్సరాల తర్వాత ఖలీఫా. వాసిఖ్ బిల్లాహ్ పాలనాకాలంలో అక్కడి గవర్నర్ వారిపై జిజియా విధించడంతో ఆ క్రైస్తవులు తమ గత చరిత్ర గురించి ఖలీఫాకు వివరించారు. దాంతో అప్పుడు కూడా జిజియా నుండి వారంతా మళ్లీ మినహాయంపు పొందారు.

గోయల్ గారూ! జిజియా గురించి ఇస్లామీయ సూత్రాలు, వాటి అమలు జరిగిన చారిత్రక ఆధారాలు చూపి మీకు వాస్తవం అర్థం కావాలని ప్రయత్నిచాను. ఈ చారిత్రక సత్యాలను గ్రహించి మీరు మీ వైఖరిని సరిదిద్దుకోవాలని పరమాత్మున్ని కోరుకుంటున్నాను. ఇస్లాం బలప్రయోగంతో ప్రబలిందని మీరు భావించుకుంటున్నారు. అది పూర్తిగా తప్పు. హజ్రత్ ముహమ్మద్ (స) ముస్లిమేతర జనుల పట్ల చూపిన అమితానురాగాలు, వారికి ఇచ్చిన హక్కులు చూసీ, అనుభవించీ వారంతా ఇస్లాం స్వీకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆ కారణంగానే ఇస్లాం దావాగ్ని లాగా వ్యాపిస్తూపోయింది.

  1. ఫిర్ హమ్ నే ఉన్ కే బీచ్ ఖియామత్ కే దిన్ తక్ కే లియే అదావత్ ఔర్ దుష్మనీ కీ ఆగ్ భడ్కా దీ. ఔర్ అల్లాహ్ జల్ద్ ఉన్హేఁ బతాదేగా జో కుఛ్ వో కర్తే రహే హైఁ. (5-14)

ఇక్కడ కూడా మీరు మీ పాత పద్ధతినే కొనసాగించారు. మొత్తం ఆయత్ ను వదిలి చివరి పదాన్ని తీసుకున్నారు. ఆయత్ లో చెప్పబడిన శిక్ష కు అసలు కారణం బయట పడకూడదనే వ్యవహరించారు. వాస్తవానికి అసలు ఆయత్ ఇలా వుంది.

‘మేము క్రైస్తవులము’ అని చెప్పుకునే వారి నుండి మేము మాట తీసుకున్నాము, ఆ తర్వాత వారికి బోధించబడిన హితువు నుండి వారు ప్రయోజనం పొందడం మరచిపోయారు. దాంతో ఖియామతు వరకు వారిలో పరస్పరం విరోధం, కాపట్యం వుండేటట్లు చేశాము. చివరకు వారు చేస్తూ వున్నవాటిని గూర్చి అల్లాహ్ వారికి తెలుపుతాడు.

మానవులతో తన ప్రవక్తల ద్వార అల్లాహ్ ఏకేశ్వరారాధన చేసేటందుకు మాట తీసుకున్నాడు. సురా 7 లో 59,65,73,85 ఆయత్ లో ఆ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఆ మాట మీద స్థిరంగా వున్నవారి కోసం స్వర్గం వుంది. మరెవరైతే తమ ప్రమాణాన్ని విస్మరించి ఏకేశ్వరారాధనకు బదులు బహుదైవారాధనకు ఒడిగట్టారో వారి కోసం నరకం వుంది. (ఈ లోకంలో ప్రవక్త మాట పెడ చెవిన బెట్టిన వారికి ఎలాంటి శిక్షలు పడ్డాయో వాటి వివరాల కోసం సూరహ్ 26 లో 120, 139, 158, 172, 173,189 ఆయత్ యొక్క అర్థం, వ్యాఖ్యానం చదవండి. విషయం అవగాహన అవుతుంది.)

ఇస్రాఈల్ తెగవారిని హజ్రత్ ఈసా అలైహిస్సలాం కూడా మునుపటి ప్రవక్తల మాదిరి ఒకే విశ్వ ప్రభువును ఆరాధించేటందుకు అహ్వానించాడు. ఒక్క సారి సూరహ్ 15 లో 72 వ ఆయత్ చదవండి ‘‘ఒకే విశ్వప్రభువును ఆరాధించండి. మరి ఆ విశ్వప్రభువుకు సాటి కల్పించిన వానికై ఆయన స్వర్గం నిషిద్ధం చేశాడు. అతని నివాసంగా నరకాగ్ని చేశాడు’’ అని మసీహ్ అన్నాడు. కానీ ఇస్రాఈల్ తెగ వారు మాట వినలేదు. దాంతో ఇస్రాఈల్ తెగకు మరొక శిక్ష కూడా వేయబడింది. అదేమంటే ఆ క్రైస్తవులు మూడు వర్గాలుగా విభజింపబడ్డారు. మొదటి వర్గం – హజ్రత్ ఈసా (అ) దేవుని కుమారుడని నమ్ముతారు. రెండవ వర్గం – హజ్రత్ ఈసా (అ) దేవునితో సంలీన రూపంగా వుంటారని నమ్ముతారు. మూడవ వర్గం – త్రిత్వం ను నమ్ముతోంది. ఈ మూడు ప్రధాన వర్గాలుగా వుండి పరస్పరం ఒకరినొకరు ‘కాఫిర్’ – అని పిలుచుకునే వారు. వీరంతా ఏకేశ్వరోపాసన వదిలేసి ‘షిర్క్’ భావనను పట్టకున్నందు వల్ల వారంతా నరకాగ్నికి అర్హులయ్యారు. ఇక ఖియామత్ నాడు వారిని ఆదుకునే వారెవ్వరూ వుండరు అని ఖుర్ఆన్ చెబుతోంది.

  1. వాస్తవానికి ఇవి వరుసగా 88,89,90 ఆయత్ లు. వీటన్నింటి తర్జుమా పూర్తిగా చదవనంత వరకు విషయం అవగాహన కాదు.
  2. 88వ ఆయత్ – తర్జుమా – మీకేమి అయ్యింది! మీరు వంచకుల విషయాన రెండు వర్గాలుగా చీలిపోయారు. వారి దుష్కర్మల వలన అల్లాహ్, వారిని మరలించేశాడు. మరి అల్లాహ్ ఎవరినైతే మార్గ భ్రష్టులను చేశాడో వారిని మీరు సన్మార్గానికి తీసుకురావాలనుకుంటున్నారా? అల్లాహ్ ఎవరినైతే దారి తప్పించేశాడో వారి కోసం ఎలాంటి దారి కానలేవు.
  3. 89వ ఆయత్ – తర్జుమా – తాము కాఫిర్లు (అంటే ముస్లిమేతరులు) అయినట్లే, మీరు కూడా తిరస్కారులు అయిపోవాలనీ, ఆపై మీరంతా ఒకే మాదిరి కావాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు అల్లాహ్ మార్గంలో ‘హిజ్రత్’ చేయనంతవరకు వారిలో ఎవ్వరిని కూడా మీ సహచరుడిగా చేసుకోవద్దు. ఆ తరువాత వారు తిరస్కరిస్తే ఎక్కడ చేజిక్కితే అక్కడ పట్టుకోండి, చంపేయండి. వారిలో ఎవ్వరిని కూడా మీ మిత్రునిగా, సహాయకుడిగా చేసుకోవద్దు.
  4. 90వ ఆయత్ – తర్జుమా – కానీ మీరు ఎవరితో సంధి చేసుకున్నారో వారితో కలుసుకొన్నవారితో, లేదా మీతో గానీ, తమ తెగతో గానీ, యుద్ధం చేయడానికి మనసు ఒప్పక మీ వద్దకు వచ్చిన వారిని మీరు పట్టుకోవద్దు, చంపవద్దు. అల్లాహ్ అభీష్టం అయి వుంటే మీ కంటే వారికి ఎక్కువ బలమిచ్చేవాడు. అప్పుడు వారు మీతో యుద్ధం చేయక మీతో సంధి చేసుకుంటే (వారిని చంపడానికీ, లేదా ఖైదు చేయడానికి) అల్లాహ్ మీకు ఎలాంటి దారి ఇవ్వలేదు. (4-88,89,90)

పాత అలవాటు ప్రకారమే ఇక్కడ కూడా మీరు అటూ ఇటూ గాకుండా మధ్యలో 89వ ఆయత్ ను మాత్రమే తీసుకున్నారు. అటు 88, ఇటు 90వ ఆయత్ ను ప్రక్కన పెట్టారు. మిగతా ఈ రెండు ఆయత్ లను కలిపి చదవకుంటే 89వ ఆయత్ లోని విషయమే బోధపడదు.

ముందుగా ఒకసారి 3-72 చదవండి – ఇస్లాంకు వ్యతిరేకంగా కొందరు యూదులు, క్రైస్తవులు ఒక పథకం వేశారు. తామూ ఈమాన్ గల వారమేనని చెప్పుకుంటూ ముందుగా ముస్లింలతో కలిసిపోవాలి. కొనాళ్ళు వారితో బాటు వుండి తిరిగి తమ సొంత మతానికి మరలి వచ్చేయాలి. దాంతో మేం ముస్లింలుగా వుండి అంతా చూసేశాము, దూరపు కొండలు నునుపుగానే వుంటాయిలే! లోపల అంతా డొల్లగానే వుంది! అని ప్రచారం చెసేయవచ్చు అనేది వారి కుట్ర.

వారిని చూసి కొంత మంది మక్కా వారు సైతం ఇలాగే చేశారు. మొదట ముస్లింలమని చెప్పుకున్నారు. కొన్నాళ్ళపాటు మదీనాలో అందరితో బాటు వుండి ఏదో సామానులు తెచ్చుకుంటామనే సాకు చూపి మక్కా వెళ్ళిపోయారు. ఆపై మళ్ళీ వాపసు రాలేదు. ఇలాంటి వారిని ముస్లింగానే కొంతమంది నమ్ముతుండేవారు. ఇక్కడ ఈ 88వ ఆయత్ లో వారి అసలు ఉద్దేశ్యం మీ అందరిని ముస్లిమేతరులుగా మార్చడమేనని స్పష్టం చేయబడింది. నేటి మన దేశ సమకాలీన పరిభాషలో చెప్పాలంటే ‘ఘర్ వాపసి’ కోసం వారొచ్చారు. కాబట్టి వారితో ఎలాంటి సంబంధం కూడా పెట్టుకోవద్దు. స్నేహం పెరిగితే వారి ప్రభావం మీ పై కూడా పడే ప్రమాదం వుంది. జాగ్రత్తగా మసలుకోండి, ‘తౌబా’ తలుపులు మాత్రం తెరుచుకునే వున్నాయి. వారు తౌబా చేసుకుని వచ్చేస్తే ఇప్పటిదాకా వారు చేసిన తప్పులన్నీ క్షమించబడతాయి. అలా లేదంటే మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే ఇలాంటి వారు ఎక్కడ దొరికితే అక్కడే వారిని అంతం చేయండి.

ఆ తర్వాత 90వ ఆయత్ లో దాని వివరణ చెప్పబడుతూ – ఎక్కడ దొరికితే అక్కడే అంతమొందించ డమనే శిక్ష వారి మతం కారణంగా ఎంతమాత్రం కాదు. 88 ఆయత్ లో చెప్పినట్టు వారి కుతంత్రపు చేష్టల వల్ల మాత్రమే! కానీ ఏ ముస్లిమేతరులైతే తమ తోటి మస్లిములతో శాంతి సామరస్యపూర్వకంగా వుంటున్నారో వారి పట్ల మతం ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు వుండవు. కావాలనుకుంటే వారి కోసం ఇస్లాం తలుపులు ఎల్లవేళలా తెరిచే వుంటాయి. చెప్పాలంటే 90వ ఆయత్ మస్లిమేతరుల పట్ల ఇస్లాం వ్యవహరించే తీరును స్పష్టంగా తెలుపుతోంది. ఇస్లాంకు వ్యతిరేకంగా దుష్ప్రచారాన్ని సైతం ఖండిస్తోంది. కాబట్టి మీరు మధ్యలో నుండి 89వ ఆయత్ ను మాత్రమే పట్టుకొచ్చి చూపడం పూర్తిగా తప్పు. 88,90 ఆయత్ లు మీరు చూపుతున్న 90 వ ఆయత్ తో సంబంధం కల్గి వున్నాయి. ఆ మూడింటినీ సంయక్తంగా చూడలేనంత వరకూ విషయం స్పష్టం కాదు.

  1. 24. ఉన్ (కాఫిరోఁ) గైర్ ముస్లిమోఁసె లడో, అల్లాహ్ తుమ్హారే హాథోఁ ఉన్హేఁ సజా దేగా. ఔర్ ఉన్హేఁ రుస్వా కరేగా. ఔర్ ఉన్కె ముఖాబిలే మే తుమ్హారీ మదద్ కరేగా ఔర్ ఈమాన్ వాలే లోగోఁ కె దిల్ ఠండే కరేగా. (9-14)

గోయల్ గారూ! ఇక్కడా అంతే.. మీరు మీ పాత పాటే పాడారు. ఈ ఆయత్ లో ఎక్కడా ‘కాఫిర్’ లతో పోట్లాడమని లేదు. కేవలం ‘వారితో’ పోట్లాడమని మాత్రమే చెప్పబడింది. ‘వారు’ అంటే – దానికి ముందు ఆయత్ లో ఏ దురాత్ముల గురించి చెప్పబడిందో ‘వారు’ మాత్రమే. ఆ దురాత్ములు చేసిన ‘పాపం’ ఇక్కడ 14వ ఆయత్ లో చెప్పబడింది. కానీ మీరు మాత్రం ‘కాఫిర్’ అనే మాటను మీ తరుపు నుండి చేర్చేశారు. ముస్లిమేతరులందరితో ఇస్లాం యుద్ధం చేయాలంటుందనే అపనింద ఎలాగైనా రక్తి కట్టించాలనే ఇందులో మీ ఉద్దేశ్యం. దైవదత్త ధర్మం ఏదైనప్పటికీ, దైవదాసులైన మానవులపై క్రౌర్యం చూపమని ఎన్నటికీ చెప్పజాలదు.

ఇక ఒక సారి 13వ ఆయత్ చదవండి గోయల్ గారూ! ………..

తాము చేసిన ప్రమాణాలను భంగపరచి, ప్రవక్తను వెళ్ళగొట్టాలని భావించుకుని ఎవరైతే తగవులాటకు కాలు దువ్వారో అట్టి వారితో మీరెందుకు యుద్ధం చేయరు? వారంటే మీరు భయపడుతున్నారా?  మరి మీరు ఈమాన్ గల వారలే అయితే అల్లాహ్ కే ఎక్కువగా భయపడాలి!

ఈ ఆయత్ లో వారు చేసిన మూడు పెద్ద పెద్ద దుష్కర్మలను ప్రస్తావిస్తూ ఇలాంటి దురాత్ములతో పోరాడండి. వారి చేష్టల ఫలితాన్ని, అల్లాహ్ మీ ద్వారా వారికి రుచి చూపుతాడు. అల్లాహ్ కు అత్యంత ప్రియమైన వ్యక్తి – అతని సందేశహరుడైన ‘రసూల్’ మాత్రమే! కాబట్టి తనకు ప్రియమైన వారి పట్ల కుతంత్రాలు పన్నడం అల్లాహ్ కు ఎంత మాత్రం ఇష్టం వుండదు. అందుకే అలాంటి వారిని ముస్లింల ద్వారా శిక్షించబడింది. వారి సామ్రాజ్యాలన్నీ తల్లకిందులు చేయబడ్డాయి.

గోయల్ గారూ! నేను చాలా క్లుప్తంగా జవాబులు ఇచ్చాను. అందులోను ఎలాంటి సూక్ష్మ విషయాలు ప్రస్తావించలేదు. ఆయత్ లకు సంబంధించిన పై వివరణ పూర్తిగా లేదా ఏ కొద్దిమాత్రం మీరు పరిశీలించినా మీకు విషయం మొత్తం అర్థమవుతుంది. విడ్డూరమేమంటే ప్రపంచంలో లోకులు కేవలం ఆక్షేపించడానికి మాత్రమే ఇస్లాంపై నిందలు వేస్తుంటారు. వారికి విద్య వుండదు. అలాంటి వారికి చెప్పినా బుర్రకు ఎక్కదు. ఎక్కించలేము కూడా! మీరు మీ ఆక్షేపణలతో బాటు, ఖుర్ఆన్ లో కొన్ని ఆయత్లను తొలగించాలంటూ వసీం రిజ్వీ కోర్టులో వేసిన కాగిత ప్రతులను కూడా పంపారు. ఆ కేసుకు కోర్టులో ఏ గతి పట్టిందో లోకానికి ఎరుకే! అయితే ఆయన సొంత షియా సమూహం అతన్ని ‘ముర్తద్’ – ధర్మభష్టుడని తేల్చేసింది. అతన్ని తమ సమాజం నుండి బహిష్కరించింది. అతను చేసిన ఆ ఆక్షేపణలను చూస్తుంటే నిజంగానే అతనికి విద్యా-జ్ఞానం లేదని నమ్మకం కలుగుతోంది. కోర్టు తీర్పు వందశాతం సమంజసమని నమ్ముతున్నాను. మరీ విచారమేమంటే మీరు మీ ఆక్షేపణలకు ప్రోద్బలంగా ఇలాంటి వ్యక్తి పై ఆధారపడ్డారే! పోయి పోయి అలాంటి వ్యక్తి చేయి పట్టుకున్నారే.. అయ్యో పాపం! ఆ విశ్వేశ్వరుడు మీకూ, నాకూ మనందరికీ తన దయతో సన్మార్గాన్ని ప్రసాదించుగాక!